Salaar Update: Prabhas Using Vintage Cars And Bike For Action Scenes - Sakshi
Sakshi News home page

Salaar: ప్రభాస్‌ కోసం స్పెషల్‌ బైక్‌, కారు!

Jul 7 2021 9:07 AM | Updated on Jul 7 2021 3:38 PM

Vintage Bike And Car Using For Prabhas Salaar Movie - Sakshi

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటారు. అందుకే పాతకాలపు (వింటేజ్‌) వస్తువులకు స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. ఆ క్రేజ్‌ కోసమే కథానుసారం సినిమాల్లో పాతకాలపు వస్తువులు, వాహనాలను చూపిస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్‌ ఓ వింటేజ్‌ బైక్‌లో రయ్‌ రయ్‌మంటూ వెళ్లడాన్ని చూసే చాన్స్‌ ప్రేక్షకులకు దక్కనుందని తెలిసింది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో ప్రభాస్‌ మార్క్‌ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే యాక్షన్‌ పరంగా ‘సలార్‌’లో ద్విచక్రవాహనంపై విలన్లను వెంటాడే సీన్స్‌లో ప్రభాస్‌ను నెక్ట్స్‌ లెవల్‌లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌.

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ వింటేజ్‌ బైక్‌ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారట. అలాగే ఓ వింటేజ్‌ కారును కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించనున్నారని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement