విజయ్‌ సేతుపతి కూమర్తెకు అత్యాచార బెదిరింపు

Vijay Sethupathi Daughter Gets Molestation Threats - Sakshi

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముత్తయ్య ఓ పెద్ద లేఖ విడుదల చేశారు.  విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల ఈ కోలీవుడ్ నటుడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ తెలిపారు. దీనిపై విజయ్ సేతుపతి కూడా స్పందించి ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్విటర్‌లో ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు. చదవండి: తప్పుకున్న విజయ్‌ తుపతి

ఇక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. విజయ్‌ సేతుపతి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవ్వడంతో సదరు నెటిజన్‌ ప్రవర్తనను ఖండిస్తున్నారు. చదవండి: వివాదంలో 800: స్పందించిన మురళీధరన్‌

అంతేగాక ఇదే ట్రోల్స్‌పై సింగర్‌ చిన్మయి కూడా స్పందించారు. ట్రోల్‌ చేసిన అకౌంట్‌ను పోలీసులకు నివేదించారు. నెటిజన్‌ వ్యాఖ్యలపై మండిపడుతూ దానికి చెందిన స్క్రీన్‌ షాన్‌ను షేర్‌ చేశారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు. అలాటే అడయార్‌ డిప్యూటీ కమిషనర్‌, చెన్నై పోలీసులను ట్యాగ్‌ చేశారు. కాగా ఇటీవల క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తెపై అత్యాచారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top