విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్ర పరిశ్రమలో 26 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బద్రి’ 2000 ఏప్రిల్ 20న విడుదలైంది. 2026 ఏప్రిల్ 20కి 26ఏళ్ల జర్నీ పూర్తయింది. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అన్నది ట్యాగ్‌లైన్ . విజయ్ సేతుపతి, సంయుక్త జోడీగా నటించారు. టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ మోహన్ పిక్చర్స్‌పై జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్ 26 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘‘పూరిగారి ప్రయాణం అద్భుతం. సినిమా రంగంలో 26 సంవత్సరాలు అంటే కేవలం మైలురాయి కాదు ధైర్యం, నమ్మకం, భయంలేని ఆలోచనలతో నిర్మించిన ఒక వారసత్వం. ‘స్లమ్ డాగ్’ చిత్రంలో పూరి సర్‌తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.


