Vijay Devarakonda: విజయ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. తన తదుపరి చిత్రంపై కీలక ప్రకటన చేశాడు హీరో. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'వీడీ12' చిత్రంలో నటించనున్నట్లు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' చిత్రం కోసం కలిసి పనిచేశారు. 2019లో వచ్చిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. దీంతో ఈ ప్రేక్షకుల్లో ఆయనపై భారీ అంచనాలున్నాయి.
తాజాగా విడుదలైన పోస్టర్ విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ను గమనిస్తే విజయ్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో ‘నేను ఎక్కడి వాడినో తెలియదు.. ఎవరిని మోసం చేస్తున్నానో చెప్పేందుకు’ అనే కొటేషన్ మరింత ఆసక్తి పెంచుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్‌ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
The Script. The Team. My next.
My heart skipped a few beats when I heard this. #VD12 pic.twitter.com/x7ELlsb6Ub
— Vijay Deverakonda (@TheDeverakonda) January 13, 2023
మరిన్ని వార్తలు :