బీరాభిషేకం, చేతిపై టాటూతో ‘రౌడీ’ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ

Vijay Devarakonda Fans Beer Both On Liger First Look Poster - Sakshi

సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. పోస్టర్‌లకు పాలాభిషేకం చేస్తారు. పూలదండలు వేసి కొబ్బరి కాయలు కొడతారు. హీరో ఫొటో నుదుట రక్తపు తిలకం దిద్దుతారు. కానీ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ విడుదల రోజే రచ్చ రచ్చ చేస్తున్నారు. పాలాభిషేకం కాదు.. ఏకంగా బీరాభిషేకం చేస్తున్నారు. సినిమా టైటిల్‌ని టాటూగా వేయించుకొని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
(చదవండి : పులి, సింహం కలిస్తే అది విజయ్‌!)

ఈ సినిమాకి వినూత్నంగా 'లైగర్' అని పేరు పెడుతూ విజ‌య్ దేవ‌రకొండ‌కు సంబంధించిన‌ ఫస్ట్ లుక్ ను సోమవారం విడుదల చేశారు. 'సాలా క్రాస్ బ్రీడ్స్‌'‌ అనే ఉప శీర్షిక కూడా పెట్టారు. టైటిల్‌ డిఫరెంట్‌గా ఉండడం, విజయ్‌, పూరీ కాంబోలో తొలి చిత్రం కావడంతో అటు పూరీ ఫ్యాన్స్‌, ఇటు రౌడీ ఫ్యాన్స్‌ అప్పుడే హడావుడి మొదలుపెట్టారు. కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేశారు. కేక్స్ కట్స్ చేశారు. లైగర్ పోస్టర్‌కు ఇద్దరు అభిమానులు బీర్‌తో అభిషేకం చేశారు. అలాగే విజయ్ వీరాభిమానులు తమ చేతులమీద ‘లైగర్’ పేరుని టాటూగా వేయించుకున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ కళ్లవెంట నీళ్లు వచ్చాయంటూ చార్మీ చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top