Vijay Devarakonda: ‘రౌడీ’ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇప్పట్లో కష్టమే! | Vijay Deverakonda, Ananya Panday Starrer Liger Movie Teaser Release Postponed | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ‘రౌడీ’ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇప్పట్లో అది లేనట్లే!

May 9 2021 12:42 PM | Updated on May 9 2021 1:04 PM

Vijay Deverakonda, Ananya Panday Starrer Liger Movie Teaser Release Postponed - Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్యాన్స్‌కి తీవ్ర నిరాశ ఎదురైంది. విజయ్‌ దేవరకొండ బర్త్‌డే నేడు(మే 09). ఈ సందర్భంగా

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్యాన్స్‌కి తీవ్ర నిరాశ ఎదురైంది. విజయ్‌ దేవరకొండ బర్త్‌డే నేడు(మే 09). ఈ సందర్భంగా విజయ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ నుంచి టీజర్‌ వస్తుందని ‘రౌడీ’ ఫ్యాన్స్‌ ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టీజర్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 

మే 9న లైగ‌ర్ ప‌వర్ ప్యాక్ట్ టీజ‌ర్ రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నాం. కాని ఈ సంక్షోభ స‌మ‌యంలో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం క‌న్నా, వాయిదా వేయ‌డ‌మే మంచిద‌నిపించింది. . త్వరలోనే మరో కొత్త తేదీతో మీ ముందుకు వస్తాం. మేము మీకు మాటిచ్చినట్లుగానే విజయ్‌ దేవరకొండను మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. ఆయన లుక్స్‌, డైలాగ్స్‌ పట్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉండదు. దయచేసి ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి. శుభ్రత పాటించండి. మీ వాళ్లని ఆరోగ్యంగా చూసుకోండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. ధైర్యంగా ఉండండి’ అని చిత్ర యూనిట్‌ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.



ఇక లైగర్‌ విషయానికి వస్తే.. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్నఈ సినిమాకి  పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement