ప్రముఖ నటి బీ జయ ఇకలేరు

Veteran Kannada Actress B Jaya passed away - Sakshi

సాక్షి, బెంగళూరు: 2021 సంవత్సరం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని  విషాదాన్ని మిగిలుస్తోంది.  ప్రముఖ కన్నడ  సినీ నటి బీ జయ (75) కన్నుమూశారు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె  బెంగళూరులోని  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న(జూన్ 3, గురువారం) తుదిశ్వాస విడిచారు.  నటి జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

క్యారెక్టర్‌ నటిగా 350కిపైగా సినిమాలలో జయ నటించారు. 1944లో జన్మించిన ఆమె థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. 1958లో భక్తా ప్రహ్లాద చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో అనేర హాస్య, క్యారక్టెర్‌ పాత్రల్లో అభిమానుల్లోజయమ్మగా ప్రత్యేక పాత్రను దక్కించుకున్నారు. డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు. తరువాతి సంవత్సరాల్లో, ఆమె టెలివిజన్ సీరియళ్లలో కూడా కనిపించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో  నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు. కాగా ఈ ఏడాదిలో ప్రముఖ కన్నడ నటుడు రాజారాంతో పాటు నటులు కృష్ణ గౌడ, గజరాజ్‌, దర్శకుడు రేణుక శర్మ, చంద్రు, మూవీ మిస్డ్ కాల్ నిర్మాత, నవీన్ కుమార్, వన్డే డైరెక్టర్, అన్నయ్య, నిర్మాత  ఎం. చంద్రశేఖర్, కిచ్చా సుదీప్ రన్నా నిర్మాత, ఆర్ శ్రీనివాస్, పోస్టర్ డిజైనర్ ముస్తాన్, నిర్మాత రాము, డాక్టర్ డీఎస్ మంజునాథ్ తదితరులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

చదవండి : SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం
దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top