Naga Shaurya: పెద్ద స్టార్‌ అవ్వాలంటే అన్ని హిట్లు కావాలి: నాగశౌర్య

Varudu Kaavalenu Hero Naga Shaurya About Stardom in Movie Industry - Sakshi

‘‘ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను. నాకు ఇక్కడ మంచి సపోర్ట్‌ దక్కింది. ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్‌ వేడుకలో బన్నీగారు (అల్లు అర్జున్‌) నా గురించి మాట్లాడటం సంతోషంగా అనిపించింది. నేనింకా కష్టపడాలి అనే స్ఫూర్తిని ఆయన మాటలు ఇచ్చాయి’’ అని నాగశౌర్య అన్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.

లక్ష్మీ సౌజన్య అక్క ‘వరుడు కావలెను’ కథ చెప్పినప్పుడు బావుందనిపించింది.. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక బ్లాక్‌బస్టర్‌ అని అర్థమైంది. ఈ సినిమా రిజల్ట్‌లో ఏదన్నా డౌట్‌గా ఉంటే నా ముఖంలో తెలిసిపోతుంది. నేను సినిమాల్లోనే నటించగలను.. బయట కాదు. 

30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లెప్పుడు? అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటారు. అబ్బాయి, అమ్మాయిలు పెళ్లికి ఎంతవరకూ రెడీగా ఉన్నారన్నది ఆలోచించరు.. ఇలాంటి పాయింట్‌ జనాలకు బాగా రీచ్‌ అవుతుందని ఈ సినిమా చేశాను. మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్‌ రాశారు. అందులో నటించడం, డైలాగులు చెప్పడం హ్యాపీగా అనిపించింది.

ఈ సినిమాని నా కుటుంబ సభ్యులకు చూపించమని చినబాబుగారు చెప్పారు. ‘సినిమా మీద డౌట్‌ ఉంటే చూపించొచ్చు.. డౌట్‌ లేనప్పుడు జనాలతో కలిసి చూస్తేనే బావుంటుంది’ అని చెప్పాను. ఆయన లాంటి నిర్మాతలు అవసరం. నాగవంశీ కూడా ఈ సినిమా విషయంలో రాజీ పడలేదు. గతంలో నేను నందినీ రెడ్డిగారితో పని చేశాను.. ఇప్పుడు లక్ష్మీ సౌజన్య అక్కతో చేశా. మేల్‌ డైరెక్టర్స్‌తో పోలిస్తే మహిళా దర్శకులకు ఓపిక ఎక్కువ.. అది మనకు అడ్వాంటేజ్‌. u పెద్ద స్టార్‌ కావడానికి  ఐదు హిట్లు కావాలి. నాకు ‘ఛలో’ పెద్ద హిట్‌. ‘వరుడు కావలెను’ రెండో పెద్ద హిట్‌. మరో మూడు హిట్స్‌ కావాలి. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం బెటర్‌. ‘నర్తనశాల’ ఫ్లాప్‌ తర్వాత కూడా నాకు బెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చిన సినిమా ‘అశ్వథ్థామ’. హిట్, ఫ్లాప్‌ శాశ్వతం కాదు.. వాటి గురించి ఆలోచించను.

నా పెళ్లి విషయంలో ప్లాన్స్‌ లేవు. టైమ్‌ వచ్చినప్పుడు జరుగుతుంది. నేను చేసిన ‘లక్ష్య’ చిత్రం నవంబర్‌లో విడుదలవుతుంది. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 90 శాతం పూర్తయింది. అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న ‘ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి’ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లాంటిది. ఇందులో ఏడు రకాలుగా కనిపిస్తాను.

చదవండి: పలు వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్‌ప్రైజ్‌లో వధూవరులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top