మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రగా, రాముడిగా నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ సినిమాలో మహేశ్‌బాబు 30 నిమిషాల పాటు రాముడిగా కనిపిస్తారని ఆల్రెడీ చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం రచయితల్లో ఒకరైన వి. విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు.
రాముడికి, కుంభకర్ణుడికి మధ్య యుద్ధానికి సంబంధించిన చిత్రంగా ‘వారణాసి’ ఉంటుందని, ఈ సీక్వెన్స్ అత్యద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, శివభక్తుడు పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక ఈ ‘వారణాసి’ సినిమాకు వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచి కథ అందించగా, దర్శకుడు దేవ కట్టా సంభాషణలు రాశారు.


