తమిళ్‌లో నటించే సమయమే దొరకట్లేదు: వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

Varalakshmi Sarathkumar Talks About Yashoda movie - Sakshi

– వరలక్ష్మి

‘‘క్రాక్‌’లో నేను చేసిన జయమ్మ పాత్ర తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో సినిమాలు చేసే టైమ్‌ లేనంతంగా తెలుగు చిత్రాలు చేస్తున్నాను. దర్శకులు నా కోసం ప్రత్యేక పాత్రలు రాస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. సమంత టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. హరి–హరీష్‌ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 11న విడుదలవుతోంది.

ఇందులో కీలక పాత్ర చేసిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘సమంత పన్నెండేళ్లుగా నాకు తెలుసు.. తను స్ట్రాంగ్‌ ఉమెన్‌. ‘యశోద’లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే. ఈ చిత్రంలో సరోగసీ అనేది ఒక టాపిక్‌ అంతే. ఈ సినిమాలో నేను డాక్టర్‌ పాత్ర చేయలేదు.. సరోగసీ ఫెసిలిటీ సెంటర్‌ హెడ్‌ పాత్రలో నటించాను. నా నిజ జీవితానికి విరుద్ధమైన పాత్ర ఇది. మహిళలు ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారు. ప్రతి పాత్ర కోసం దర్శకులు బాగా రీసెర్చ్‌ చేశారు. ఈ మూవీ కోసం సమంత చాలా కష్టపడ్డారు. మణిశర్మగారు మంచి సంగీతం ఇచ్చారు. శివలెంకగారు గ్రాండ్‌గా ఈ మూవీ తీశారు. ప్రస్తుతం నేను తెలుగులో ‘శబరి’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కీ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top