స్టార్‌ హీరోలను గడగడలాడిస్తున్న లేడీ విలన్‌ | Sakshi
Sakshi News home page

Varalakshmi Sarathkumar: హీరోలకే సవాల్‌ విసురుతున్న వరలక్ష్మి

Published Tue, Jan 17 2023 4:48 PM

Varalakshmi Sarathkumar as Powerful Lady Villain - Sakshi

లేడీ విలన్‌గా మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. పైగా స్టార్ హీరోలను సైతం గడగడలాడించడం, వారికి సవాల్ విసరడం చిన్న విషయం కాదు. కాని వరలక్ష్మి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గతంలో క్రాక్‌లో జయమ్మగా నటించి మెప్పించింది. ఇప్పుడు వీర సింహారెడ్డిలో మరోసారి నట విశ్వరూపాన్ని చూపింది. వీర సింహారెడ్డి సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది వరలక్ష్మి. బాలయ్యపై పగ పెంచుకోవడం, సీమ యాసలో డైలాగ్స్ చెప్పడం, మొత్తంగా నరసింహలో నీలాంబరి పాత్రను మరోసారి గుర్తు చేసింది వరలక్ష్మి. వీర సింహారెడ్డి సినిమాలో సెకండ్ హాఫ్ తనదైన నటనతో దుమ్మురేపింది.

2018లోనే కోలీవుడ్‌లో లేడీ విలన్‌గా బిజీ అయింది వరలక్ష్మి. ఆ ఏడు తమిళంలో తెరకెక్కిన పందెంకోడి సీక్వెల్, సర్కార్ లాంటి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు చేసి అబ్బురపరిచింది. సర్కార్, మారి -2 సినిమాల్లో నటన వరలక్ష్మి కెరీర్‌ను మలుపు తిప్పింది. గోపీచంద్ మలినేని గతంలో తెరకెక్కించిన క్రాక్‌లోనూ జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, అందులోనూ వరలక్ష్మి పాత్ర సెన్సేషన్ సృష్టించడంతో లేడీ విలన్‌గా స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకుంది లేదు. ఇప్పుడు వీర సింహారెడ్డిలో నటనకు మరోసారి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

చదవండి: తల్లి కాబోతున్న సాహో నటి
తేజస్వినితో అఖిల్‌ ప్రేమాయణం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement