'ఆయన కోసమే అలా చేయించుకున్నా'.. మెగాస్టార్‌పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్! | Vaishnav Tej Gives Clarity On Megastar Chiranjeevi Name Hair Cut On Birthday, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vaishnav Tej: 'అంతకు మించి ఏం ఇవ్వగలను'.. ఆ పేరుపై వైష్ణవ్ తేజ్ క్లారిటీ!

Published Tue, Nov 21 2023 1:23 PM

Vaishnav Tej Clarity On Megastar Chiranjeevi Name Crop On Birthday - Sakshi

చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన మూవీతో అభిమానులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం ఆదికేశవతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రం పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మెగాస్టార్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరు అని పేరు వచ్చేలా క్రాఫ్ చేయించుకున్న ఫోటోపై స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. 

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. 'మామయ్య పుట్టినరోజుకు అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. సాయి ధరమ్‌ తేజ్ పెద్ద కత్తిని బహుమతిని తీసుకొచ్చాడు. నేను మాత్రం ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలనని అనుకున్నా. అందుకే చిన్న సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్నా. చిరు అని వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నా. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్‌ జరిగినా రామ్‌ చరణ్‌ అన్న అందరినీ ఆకట్టుకుంటాడు. సాయిధరమ్‌ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్‌ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ విషయాన్ని మేము ఎప్పుడో మర్చిపోయాం.' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement