
పవన్ కల్యాణ్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎన్నికల ముందే ప్రారంభం అయింది. కొన్నాళ్లకే ఎన్నికలు రావడం..పవన్ బిజీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లింది. ఇటీవల ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కల్యాణ్ అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. పవన్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది అని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.