Upcoming Movies 2022: వచ్చే ఏడాది అలరించనున్న సినిమాలు ఇవే..

Upcoming Telugu And Hindi Movies In 2022 Year - Sakshi

Upcoming Telugu And Hindi Movies In 2022 Year: కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు తెరచుకున్నాయి. దీంతో భారీ సినిమాలతో థియేటర్లు సందడిగా మారాయి. దీపావళి కానుకగా వచ్చిన హిందీ చిత్రం 'సూర్యవంశీ' బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో హిందీ చిత్రపరిశ్రమ వచ్చే ఏడాది మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో ఖాన్ ద్వయం సల్మాన్‌, అమీర్‌, షారుఖ్‌ నటించిన మెగా భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అమీర్‌ ఖాన్‌ నటించిన 'లాల్‌ సింగ్‌ చద్దా' ఏప్రిల్‌లో విడుదల కానుండగా, షారుఖ్‌ ఖాన్‌ 'పఠాన్‌', సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ 3' సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉ‍న్నాయి. 

మరోవైపు నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'అఖండ' సినిమాతో మంచి ప్రారంభాన్ని సొంతం చేసుకుంది టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ. ఈ ఆరంభం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన 'పుష్ప'తో కొనసాగుతోంది. వచ్చే ఏడాది కూడా తెలుగు ప్రేక్షకులను భారీ సినిమాలు అలరించనున్నాయి. వాటిలో మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' 2022లో రిలీజ్‌ కానుంది. ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన క్రేజీ మూవీ 'రాధేశ్యామ్‌' కూడా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఆర్‌ఆర్‌ఆర్‌లో సీతగా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌ నటించిన 'గంగూబాయి కతియావాడి', ఆమె ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ 'శంషేరా', 'బ్రహ్మాస్త్ర' సినిమాలు వచ్చే ఏడాదే అలరించనున్నాయి. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జయేష్‌ భాయ్‌ జోర్దార్‌' ఫిబ్రవరిలో, 'సర్కస్‌' జూలైలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటితో పాటు మరికొన్ని సినిమాలు కొత్త సంవత్సరంలోనే అలరించనున్నాయి. అవేంటో చూద్దాం. 

1. ఆర్ఆర్‌ఆర్‌ (రౌద్రం.. రణం.. రుధిరం)- జనవరి 7
2. రాధేశ్యామ్‌- జనవరి 14
3. బంగార్రాజు- జనవరి 15
4. పృథ్వీరాజ్‌- జనవరి 21
5. ఆచార్య- ఫిబ్రవరి 4
6. ఖిలాడీ- ఫిబ్రవరి 11
7. మేజర్‌- ఫిబ్రవరి 11
8. గంగూబాయి కతియావాడి- ఫిబ్రవరి 18
9. 18 పేజీలు- ఫిబ్రవరి 18
10. భీమ్లా నాయక్‌- ఫిబ్రవరి 25
11. జయేష్‌ భాయ్ జోర్దార్‌- ఫిబ్రవరి 25
12. శంషేరా- మార్చ్‌ 18
13. భూల్‌ భులయా 2- మార్చ్‌ 25
14. రామారావు ఆన్‌ డ్యూటీ- మార్చ్‌ 25
15. అనేక్‌- మార్చ్‌ 31
16. సర్కారు వారి పాట- ఏప్రిల్‌ 1
17. సలార్‌- ఏప్రిల్‌ 14
18. లాల్‌ సంగ్‌ చద్దా- ఏప్రిల్‌ 14
19. కేజీఎఫ్‌ 2- ఏప్రిల్‌ 14
20. హరి హర వీరమల్లు- ఏప్రిల్‌ 29
21. ఎఫ్‌ 3- ఏప్రిల్‌ 29
22. మైదాన్‌- జూన్‌ 3
23. జుగ్‌ జుగ్గ్‌ జియో- జూన్‌ 24
24. ఆదిపురుష్‌- ఆగస్టు 11
25. రక్షా బంధన్‌- ఆగస్టు 11
26. లైగర్‌- ఆగస్టు 25
27. బ్రహ్మాస్త‍్ర- సెప్టెంబర్‌ 9
28. యోధ- నవంబర్‌ 11

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top