రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన బుల్‌..బుల్‌.. సాంగ్‌ విన్నారా? | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సిప్లిగంజ్‌, భీమ్స్‌ పాడిన బుల్‌..బుల్‌.. సాంగ్‌ విన్నారా?

Published Sun, Mar 19 2023 6:23 AM

Unstoppable Movie Title Song Launched By Gopichand - Sakshi

వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రజిత్‌ రావు నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్‌ బుల్‌ అన్‌స్టాపబుల్‌..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్‌ విడుదల చేశారు.

కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలసి భీమ్స్‌ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్‌ మూమెంట్స్‌ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement