మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

Uday Kiran: మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్

Published Tue, Mar 5 2024 5:53 PM

Uday Kiran Nuvvu Nenu Re Release Date Latest Update - Sakshi

టాలీవుడ్‌లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?)

ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి.

(ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement