TV Actress Chaitra Rai Blessed With Baby Girl - Sakshi
Sakshi News home page

Chaitra Rai: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ చైత్ర

Aug 17 2021 1:15 PM | Updated on Aug 17 2021 7:29 PM

TV Actress Chaitra Rai Blessed With A Baby Girl - Sakshi

టీవీ నటి చైత్ర రాయ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల తల్లి కాబోతున్నానంటూ అభిమానులకు తీపి కబురు చెప్పిన చైత్ర సోమవారం ఉదయం తనకు ఆడబిడ్డ పుట్టిందంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కానీ బేబీ ఫొటోను మాత్రం ఆమె షేర్‌ చేయలేదు. ‘ఇట్స్‌ ఏ బేబీ గర్ల్‌.. ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి అనుభూతిని పొందలేదు. మా కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. చైత్ర పోస్టుకు యాంకర్‌ విష్ణు ప్రియ, సుష్మ, మంజు ఇతర నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తెలుగు, క‌న్న‌డ సీరియ‌ల్స్‌లో న‌టించిన చైత్ర ‘ఒకరికి ఒకరు’, ‘మనసున మనసై’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ’  వంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ అనే సీరియల్‌లో నటిస్తుండగానే ఆమె సడెన్‌గా ఆ సీరియల్‌ నుంచి తప్పుకున్నారు. దీనికి కారణం మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన బేబీ బంబ్ ఫొటోషూట్‌, సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను చైత్ర అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement