ఇలా జరగడం మూడోసారి.. ‘జారా’పై త్రిష సీరియస్‌ | Trisha Fires On Zara, Social Media Post Goes Viral | Sakshi
Sakshi News home page

దుస్తులు దుర్వాసన వస్తున్నాయి.. చూసుకోరా? : త్రిష సీరియస్‌

Jul 4 2026 9:36 AM | Updated on Jul 4 2026 10:09 AM

Trisha Fires On Zara, Social Media Post Goes Viral

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి  అయిన తర్వాత, ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ త్రిష పేరు కూడా నెట్టింట మరింత వైరల్‌గా మారింది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. తాజాగా త్రిష చేసిన ఒక పోస్ట్ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ బ్రాండ్‌కు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

త్రిష తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ 'జారా' (Zara) లో ఒక డ్రెస్‌ను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసింది. అయితే, డెలివరీ వచ్చిన పార్సిల్‌ను ఓపెన్ చేసిన ఆమెకు తీవ్ర నిరాశ, అసహనం ఎదురయ్యాయి. ఆ దుస్తుల నుంచి భరించలేనంతగా దుర్వాసన రావడమే ఇందుకు కారణం. ఈ చేదు అనుభవంపై త్రిష సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు బ్రాండ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్ని ఘాటు సూచనలు చేసింది.

‘డియర్‌ జరా.. ఒక చిన్న విన్నపం. మేము మరోసారి హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసినప్పుడు, దుస్తుల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోండి. ఇప్పటికే మూడు సార్లు ఆర్డర్‌ చేస్తే.. దుర్వాసన వస్తున్న దుస్తులనే పంపించారు. కనీసం ప్యాక్ చేసే ముందైనా ఆ దుస్తుల వాసనను ఒకసారి చూసి పంపించండి’ అంటూ త్రిష సలహా ఇస్తూనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి ఇలాంటి క్వాలిటీ లేని సర్వీస్ రావడంపై త్రిష అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement