టాలీవుడ్ రీఎంట్రీలో త్రిషకు 'సినిమా' కష్టాలు | Trisha Comeback Film Vishwambhara Faces Delay Amid Ongoing Release Uncertainty, Deets Inside | Sakshi
Sakshi News home page

Trisha: త్రిష పోస్టర్ రిలీజ్.. మూవీ రిలీజ్ ఎప్పుడు?

May 4 2026 1:12 PM | Updated on May 4 2026 1:44 PM

Trisha As Avani Vishwambhara Movie Poster Announcement

త్రిష.. తెలుగులో చాలా సినిమాలు చేసిన స్టార్ హీరోయినే. కానీ గత పదేళ్లలో టాలీవుడ్‌లో నటించలేదు. చేసిన ఒక్క మూవీ 'విశ్వంభర' కూడా ఎప్పుడో రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీమ్, ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ‍ట్రెండింగ్‌లో త్రిష)

'వర్షం'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. తర్వాత చిరంజీవి, మహేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, రవితేజ తదితర స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2016లో చివరగా 'నాయకి' మూవీ చేసింది. ఆ టైంలో ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ '96' అనే తమిళ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. అనంతరం పొన్నియిన్ సెల్వన్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి 'విశ్వంభర' కోసం ఈమెని హీరోయిన్‌గా తీసుకున్నారు.

2023లో విశ్వంభర చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. తాజాగా జూలైలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వచ్చాయి గానీ త్రిష పుట్టినరోజు విషెస్ చెబుతూ వదిలిన పోస్టర్‌లో డేట్ ఏం లేదు. అంటే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదనమాట. చూస్తుంటే త్రిషకు టాలీవుడ్ రీఎంట్రీ విషయంలో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది.

పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ కథతో తీసిన 'విశ్వంభర'లో త్రిష హీరోయిన్ అయినప్పటికీ ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా తదితర హీరోయిన్లు కూడా ఇతర పాత్రల్లో నటించారు. వశిష్ఠ దర్శకుడు కాగా కీరవాణి సంగీతమందించారు. యువీ క్రియేషన్స్ రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టేసింది గానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతోనే రిలీజ్ ఎప్పుడో దర్శకనిర్మాతలు కూడా చెప్పలేకపోతున్నారు.

(ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?)

Advertisement
 
Advertisement
Advertisement