Tom Holland: నేను ఏ ఇల్లు కొనలేదు.. రూమర్స్​పై హీరో క్లారిటీ

Tom Holland Reacts On Buying New House With Zendaya - Sakshi

స్పైడర్​ మ్యాన్​ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోహీరోయిన్లు టామ్​ హోలాండ్, జెండయా. 'స్పైడర్​ మ్యాన్​: హోమ్ కమింగ్​' చిత్రంతో తొలిసారిగా కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో  పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి లండన్​లో ఒక ఖరీదైన భవంతిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఖరీదైన భవంతి విలువ అక్షరాలా రూ. 36 కోట్లు అని హాలీవుడ్​ వర్గాల భోగట్టా. 

​అయితే ఈ వార్తలపై హీరో టామ్​  మౌనం వీడాడు. అవన్ని వట్టి పుకార్లని 'లైవ్ విత్​ కెల్లీ అండ్​ ర్యాన్'​ అనే షోలో తేల్చేశాడు. 'నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను సౌత్​ లండన్​లో ఇల్లు కొన్నానని. ఇది పూర్తిగా తప్పు. నేను ఏ కొత్త ఇల్లు కొనుగోలు చేయలేదు.' అని తెలిపాడు టామ్​. అలాగే దీనికి కొనసాగింపుగా తాను కొత్త ఇల్లు కొన్నానన్న వార్తపై 'వావ్​.. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆ ఇంటి తాళాలు ఎప్పుడూ దొరుకుతాయా అని.' అంటూ చమత్కారంగా స్పందించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top