ఆన్‌లైన్‌ క్లాసులతో బిజీ కాబోతున్న నాగ్‌

Tollywood: Nagarjuna Enrolls For Online Classes - Sakshi

ఐదు పదుల వయసు పైబడినప్పటికీ రొమాంటిక్‌ కథలతో హిట్‌ కొట్టగలడు టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున. ఈ క్రమంలోనే ‘సోగ్గాడే చిన్నినాయినా’ తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. అయితే ఇటీవల నాగ్ ఎక్కువగా ఫుల్ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వైపు ఆస్తక్తి చూపుతున్నాడనే చెప్పాలి. ఈ మధ్య ఆయన నటించిన ‘ఆఫీసర్’, ‘వైల్ట్‌ డాగ్’ ‌చిత్రాలు యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కినవే. ప్రస్తుతం‌ నాగ్‌.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో నటించాల్సి ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్‌ నేపథ్యంలోనే తెరకెక్కనుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్, ఎన్‌ఐఏ ఆఫీసర్ రోల్స్‌లో నటించిన నాగార్జున ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. కాజల్ అగర్వాల్ ఇతడితో జోడీ కడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నాగార్జున ఈ సినిమా కోసం క్రవ్ మగా  (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అభివృద్ధి చేసిన ఆత్మరక్షణ సాంకేతికత) పేరుతో పిలవబడే యుద్ధకళను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. కరోనా వల్ల మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఇండియాకు రాలేకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల ద్వారా నాగ్ ఈ యుద్ధ విద్యను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యుద్ధకళతో పాటు కటానా అనే మరో యుద్ధకళను కూడా నాగార్జున నేర్చుకుంటున్నారట. తన పాత్ర కోసం అంతలా కష్టపడుతున్నారంటే ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ యాక్షన్ స్టంట్స్‌ రేంజ్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

( చదవండి: సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్‌ బ్రేక్‌’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top