Ananya Nagalla: వరుడిని చూసినందుకు థ్యాంక్స్.. అది కూడా చెబితే హాజరవుతా: అనన్య

Tollywood Heroine Ananya Nagalla Fire On Marriage Rumours - Sakshi

టాలీవుడ్‌లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ అనన‍్య నాగళ్ల. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ముందుకెళ్తోంది. అయితే ఇటీవల ఆమెపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్‌లో ఓ అగ్రనిర్మాత కుమారుడితో వివాహబంధంలోకి అడుగు పెడుతున‍్నట్లు పలు కథనాలు వచ్చాయి.  

ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది అనన్య  . 'నాకోసం వరుడిని చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో దయచేసి నాకు తెలియజేయండి. దానివల్ల నా పెళ్లికి నేను కూడా హాజరవుతానంటూ' వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’, ‘మ్యాస్ట్రో’  చిత్రాల తర్వాత అనన్య ‘శాకుంతలం’లో నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top