Thank God Song: 'థ్యాంక్ గాడ్' వీడియో సాంగ్ రిలీజ్.. ప్రత్యేక ఆకర్షణగా నోరా ఫతేహీ..

Thank God Movie Manike Video Song Released Today - Sakshi

సిద్ధార్థ్‌ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం'థ్యాంక్‌ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శ్రీలంక సింగర్‌ యోహాని పాడిన 'మనికే మాగే హితే' సాంగ్‌ను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ పాటలోనూ యోహానీ తనదైన వాయిస్‌తో అలరించింది.  ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి.  ఈ సినిమా చిత్రగుప్తగా అజయ్ దేవగణ్ కనిపించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనుంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ కాగా ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ యూపీలోని జాన్‌పూర్‌ కోర్టులో కేసు నమోదైంది.  

(చదవండి: చిక్కులు తెచ్చిన ట‍్రైలర్.. నటులపై కేసు నమోదు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top