తంగలాన్‌ కోసం ఎదురుచూస్తున్నా: మాళవిక | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ కోసం ఎదురుచూస్తున్నా: మాళవిక

Published Sun, Sep 10 2023 9:25 AM

Thangalaan Movie Update Reveal Malavika Mohanan - Sakshi

తంగలాన్‌ చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నటి మాళవిక మోహన్‌ పేర్కొన్నారు. విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం తంగలాన్‌. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి పార్వతి మాళవిక మోహన్‌ హీరోయిన్‌గా నటించారు. పశుపతి హాలీవుడ్‌ డేనియల్‌ కాల్టజీరోనో తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్‌)

కోలార్‌ బంగారు గనుల నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో తెరపైకి తీసుకురావడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్రంలో నటుడు విక్రమ్‌ పాత్ర, ఆయన గెటప్‌ చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు నటించనటువంటి వినూత్న పాత్రలో విక్రమ్‌ను దర్శకుడు పా.రంజిత్‌ తెరపై ఆవిష్కరిస్తున్నారు. కాగా ఈ చిత్ర విడుదల కోసం ప్రేక్షకులతో పాటు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నటి మాళవిక మోహన్‌ పేర్కొన్నారు.

ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో  అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తంగలాన్‌ చిత్ర అప్‌డేట్‌ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్‌ లేదని, తానూ అలాంటి దాని కోసమే ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై దర్శకుడు ఓ మెసేజ్‌ పంపిస్తానని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించినట్లు చెప్పారు. తంగలాన్‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు చూడాలని తాను కోరుకుంటున్నానని మాళవిక మోహన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement