ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఏకంగా 9 భాషల్లో నటించింది! | Sakshi
Sakshi News home page

Guess The Actress: తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.. కానీ!

Published Tue, Aug 22 2023 4:45 PM

Thammudu Movie Actress Preeti Jhangiani Details - Sakshi

ఈమె ఓ తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అది సూపర్‌హిట్ కావడంతో మంచి ఛాన్సులు దక్కించుకుంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. అయితే తొలి నాలుగు మూవీస్.. వరసగా తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో చేసింది. చాలామంది బ్యూటీస్‌కి సాధ్యం కాని విధంగా తొమ్మిది భాషల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించింది. ఇన్ని చెప్పాం కదా మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న నటి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. అవును మీలో కొంతమంది ఊహించింది కరెక్టే. ఈ బ్యూటీ పేరు ప్రీతి జింగానియా. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. తొలుత ఓ ఆల్బమ్ సాంగ్‌లో కనిపించింది. ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. అలా ఈమెకు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి.

(ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్)

ఈమెకు తొలుత ఓ మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే దీని కంటే ముందు పవన్‌తో చేసిన 'తమ్ముడు' చిత్రం రిలీజైంది. దీంతో తమ్ముడు బ్యూటీగా పేరు స్థిరపడిపోయింది. 1999లో ఈ చిత్రంతో పాటు ప్రీతి జింగానియా హీరోయిన్‌గా చేసిన మలయాళం, తమిళ మూవీస్ కూడా రిలీజయ్యాయి. ఓవరాల్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, రాజస్థానీ భాషల్లో ఈమె సినిమాలు చేయడం విశేషం. 18 ఏళ్ల కెరీర్‌లో దాదాపు  30కి పైగా చిత్రాల్లో నటించింది.

ఓవైపు హీరోయిన్‌గా చేస్తుండగానే 2008లో నటుడు పర్విన్ దబ్బాస్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అలా కొన్నాళ్ల పాటు యాక్టింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చింది. 2012లో తిరిగి సినిమాల్లోకి వచ్చింది. అయితే రీఎంట్రీలో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 2017 తర్వాత నటనకు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్‌గా రిలీజైన 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈమెని ఫస్ట్ ఎవరో అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టేశారు.

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

Advertisement
 
Advertisement
 
Advertisement