
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman) తనది మంచి మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు. కళ్లు లేని వ్యక్తికి చూపు ప్రసాదిస్తానని మాటిచ్చాడు. ఇతడు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగింగ్ కాంపిటీషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ రాబోతోంది. ఆగస్టు 29న ఈ షో ప్రారంభం కానుంది. ఇందులో తమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా యాంకరింగ్ చేయనున్నారు.
టాలెంట్‌కు ఫిదా
ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఆడిషన్స్ నిర్వహించారు. వారిలో ఓ అంధుడు కూడా ఉన్నాడు. అతడి టాలెంట్‌కు జడ్జిలు ఫిదా అయ్యారు. చిన్నప్పటి నుంచే కంటిచూపు లేదా? అని తమన్ అడగ్గా.. పుట్టినప్పటినుంచే గుడ్డివాడిని అని తెలిపాడు. అందుకు తమన్.. నేను, కార్తీక్ కలిసి నీకు కళ్లు కనిపించేలా చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ మాటకు అంధుడు ఎంతగానో సంతోషించాడు. కళ్లు లేని వ్యక్తికి ఆపరేషన్ ద్వారా చూపు ప్రసాదించేందుకు ముందుకు వచ్చిన తమన్, కార్తీక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.