కమెడియన్‌ గౌతం రాజు ఇంట విషాదం

Telugu Comedian Gautham Raju Brother Passes Away Due To COVID 19 - Sakshi

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనాతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకం విడిచి వెళుతుండటం కలవరపెడుతోంది. వారి కుటుంబ సభ్యులను కూడా ఈ మహహ్మారి వదలడం లేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మృతి చెందారు. తాజాగా కమిడియన్ గౌతంరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సిద్దార్థ కరోనాతో మృతి చెందాడు.

ఇటీవల కోవిడ్‌ బారిన పడిన ఆయన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. సిద్దార్దకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన సోదరుడి మృతి విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేసిన గౌతం రాజు.. బయట పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయని, అంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top