కాంగ్రెస్‌ విజయం.. అల్లు అరవింద్‌ శుభాకాంక్షలు.. | Telangana Assembly Elections 2023: Allu Aravind Congratulates Congress Party | Sakshi
Sakshi News home page

Allu Aravind: తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం.. సంతోషంగా ఉందన్న నిర్మాత

Published Mon, Dec 4 2023 1:20 PM | Last Updated on Mon, Dec 4 2023 1:39 PM

Telangana Assembly Elections 2023: Allu Aravind Congratulates Congress Party - Sakshi

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రెండుసార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు పక్కనపెట్టేశారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మొత్తంగా 64 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ అధికారం చేపట్టబోతోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ హస్తం పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు.

సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా సినీపరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే ఇండస్ట్రీ తరపున కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు.

చదవండి: సిల్క్‌ స్మితపై కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ వైరల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement