తీన్మార్‌ మల్లన్న సినిమాలో నటించాడా? కామెడీ సీన్‌ వైరల్‌! | Teenmar Mallanna And Venu Madhav Comedy Scene In Movie, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Teenmar Mallanna Venu Madhav Comedy Scene: తీన్మార్‌ మల్లన్న సినిమాలో నటించాడా? కామెడీ సీన్‌ వైరల్‌!

Published Tue, Jan 2 2024 3:49 PM

Teenmar Mallanna, Venu Madhav Comedy Scene Goes Viral - Sakshi

తీన్మార్‌ మల్లన్న.. సోషల్‌ మీడియాను రెగ్యూలర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరు. ప్రతి రోజు ఉదయం యూట్యూబ్‌ లైవ్‌లోకి వచ్చి వార్త పత్రికల్లో వచ్చిన వార్తలపై చర్చిస్తుంటాడు. అతని అసలు పేరు నవీన్‌ చింతపండు. కానీ తీన్మార్‌ మల్లన్న పేరుతో ఓ వార్త చానెల్‌లో యాంకర్‌గా పని చేసి పాపులర్‌ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్‌ వార్త చానల్‌ని, వార్త పత్రికను పెట్టుకొని.. తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలీలో చర్చిస్తుంటాడు.

(చదవండి: 2024లో ఈ సినిమాలు వెరీ స్పెషల్‌.. రూ. 1000 కోట్లే టార్గెట్‌!)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎక్కువగా విమర్శించడం కారణంగా మల్లన్నకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇలా పాత్రికేయుడు, రాజకీయ నాయకుడిగానే మల్లన్న అందరికి తెలుసు కానీ.. అతను కూడా ఒక నటుడనే విషయం ఎవరికీ తెలియదు. మల్లన్న ఓ సినిమాలో నటించాడు. ప్రస్తుతం మల్లన్న నటించిన సినిమాలోని  ఓ కామెడీ సీన్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  అందులో దివంగత కమెడియన్‌ వేణుమాదవ్‌ కూడా ఉన్నారు. 

(చదవండి: 2024లో బాలీవుడ్‌ నుంచి సత్తా చాటేది ఎవరు..?)

మల్లన్న నటించిన ఆ చిత్రం పేరు  ‘శ్రీమతి బంగారం’. రాజీవ్‌ కనకాల, రిచర్డ్‌ రిషి, వేణుమాధవ్‌, హేమలతో పాటు తీన్మార్‌ మల్లన్న కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. 2016లో  ఈ మూవీ రిలీజై బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. అసలు ఆ సినిమా రిలీజైన విషయం కూడా జనాలకు తెలియదు. ఇక మల్లన్న అందులో నటించారనే విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ఈ విషయం ఇన్నాళ్లు మరుగున పడింది. అయితే తాజాగా మల్లన్నకు సంబంధించిన కామెడీ సీన్‌ని ఎవరో కట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది. మల్లన్నలో కూడా మంచి నటుడు ఉన్నాడే అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement