2024లో ఈ సినిమాలు వెరీ స్పెషల్‌.. రూ. 1000 కోట్లే టార్గెట్‌! | Sakshi
Sakshi News home page

2024లో ఈ సినిమాలు వెరీ స్పెషల్‌.. రూ. 1000 కోట్లే టార్గెట్‌!

Published Tue, Jan 2 2024 1:31 PM

Prabhas, NTR, Allu Arjun Other Tollywood Stars Pan India Movies To Release In 2024 - Sakshi

ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే కేవలం బాలీవుడ్‌ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.  టాలీవుడ్‌ సినిమాలు ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్నాయి. 2023లో కూడా నార్త్‌ కంటే సౌత్‌ సినిమాలే ప్రేక్షకులను బాగా అలరించాయి. అందులో టాలీవుడ్‌ సినిమాలే ఎక్కువ. ఇక 2024లో కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ని తెలుగు సినిమా శాసించబోతుంది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్టార్‌ హీరోల సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే రాబోతున్నాయి. వాటిల్లో కొన్ని రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసే సత్తా ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. 

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్‌ చిత్రం కోసం యావత్‌ సీనీ ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తోంది. సుకుమార్‌- బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప మూవీ ఏ రేంజ్‌లో కలెక్షన్స్‌ని కొల్లగొట్టిందో తెలిసిందే. పు​ష్ప 2కి పాజిటివ్‌ టాక్‌ వస్తే మాత్రం రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ ఈజీగా వచ్చేస్తాయి. 

ఇక ఈ ఏడాది టాలీవుడ్‌ నుంచి మరో పాన్‌ వరల్డ్‌ మూవీ రాబోతుంది. అదే కల్కీ 2898 ఏడీ. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రమిది. ప్రభాస్‌ ఫ్లాప్‌ మూవీలకు కూడా వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. సలార్‌తో హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. కల్కీ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తే మాత్రం కలెక్షన్స్‌ ఊహించలేం. నాగ్‌ అశ్విన్‌  ప్రతిష్టాతక్మంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇక రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ అంచనా ఉన్న మరో చిత్రం గేమ్‌ ఛేంజర్‌. దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. శంకర్‌ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. పైగా ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ మార్కెట్‌ కూడా భారీగా పెరిగింది. ఈ చిత్రానికి హిట్‌ టాక్‌ వస్తే.. రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ వరకు వచ్చే అవకాశం లేకపోలేదు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం దేవర. జనతా గ్యారేజ్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది.  జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ  పాన్‌ ఇండియా సినిమా తొలి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.  

వీటితో పాటు మహేశ్‌ బాబు ​‍(గుంటూరు కారం), పవన్‌ కల్యాణ్‌(ఓజీ), వెంకటేశ్‌(సైంధవ్‌), నాగార్జున(నా సామిరంగ), రవితేజ(ఈగల్‌)లాంటి బడా సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే సందడి చేయబోతున్నాయి. ఇలా  అనేక క్రేజీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. గతేడాది స్క్రీన్ మీద కనిపించని స్టార్ హీరోలంతా ఈ ఏడాదిలో వెండితెరపై మెరవనున్నారు.  ఈ ఏడాది మరిన్ని విజయాలు, రికార్డులతో టాలీవుడ్‌కి అందాలని కోరుకుందాం. 

Advertisement
 
Advertisement