Shabaash Mithu Trailer: తాప్సీ 'శభాష్ మిథూ' ట్రైలర్ రిలీజ్.. ఆసక్తిగా, ఎమోషనల్‌గా..

Taapsee Pannu Starrer Shabaash Mithu Trailer Released: ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్‌రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం 'శభాష్ మిథూ'. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్, కెప్టెన్‌గా మారడం, క్రికెట్‌లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !