రియల్‌ లైఫ్‌లో ఒక్కటి కానున్న రీల్‌ జంట! | Swasika Vijay Getting Married In January 2024 With Co-Star And Model Prem Jacob, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Swasika Vijay-Prem Jacob Marriage: హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, యాంకర్‌గా.. ఈ నెలలో ప్రియుడితో పెళ్లి

Published Wed, Jan 17 2024 10:24 AM

Swasika Vijay Getting Married In January 2024 - Sakshi

మలయాళీ ముద్దుగుమ్మ స్వసిక విజయ్‌ పెళ్లి చేసుకోబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నటుడు ప్రేమ్‌ జకోబ్‌తో ఏడడుగులు వేయనుందని భోగట్టా! తాజాగా ఈ పుకార్లపై నటి స్పందిస్తూ.. నిజంగానే వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే పెళ్లి జరగనుందని స్పష్టం చేసింది. జకోబ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

ఆ సీరియల్‌ నుంచే..
కాగా వీరిద్దరూ 'మనంపోలే మాంగళ్యం' అనే సీరియల్‌లో జంటగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆన్‌స్క్రీన్‌ జంటగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న వీరు మరికొద్దిరోజుల్లోనే ఆఫ్‌స్క్రీన్‌ జంటగానూ మెప్పించనున్నారు. స్వసిక విజయ్‌ మొదట్లో హీరోయిన్‌గా నటించింది. తర్వాత సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పాత్రలు పోషించింది. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె సీరియల్స్‌ కూడా చేసింది.

తెలుగులో ఆ సినిమాలో హీరోయిన్‌గా
స్వసిక నటి మాత్రమే కాదు యాంకర్‌ కూడా! పదేళ్లుగా ఎన్నో షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. అలా యాంకర్‌గా కూడా ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకుంది. వీటికి తోడు షార్ట్‌ ఫిలింస్‌, మ్యూజిక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. 2012లో వచ్చిన 'ఎటు చూసినా నువ్వే' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్‌.. అసలు విషయం బయటపెట్టిన సూపర్‌ స్టార్‌

whatsapp channel

Advertisement
 
Advertisement
 
Advertisement