Sakshi News home page

అనుమానస్పదంగా 'మామన్నన్' అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మృతి

Published Tue, Nov 28 2023 1:46 PM

Suspicious Death Of Maamannan Assistant Director Marimuthu - Sakshi

కోలీవుడ్‌ చిత్రపరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్‌ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువ  డైరెక్టర్‌ మృతి చెందాడు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి తమిళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మరి సెల్వరాజ్. ఈ సినిమాల అన్నింటికి ఆయన వద్ద  మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ సినిమాల విజయాల వెనుక మారిముత్తు పాత్ర చాలా ఎక్కువగానే ఉందని బహిరంగంగానే మరి సెల్వరాజ్‌ అన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

(ఇదీ చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్‌..!)

ఊపిరాడకనే మరిముత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుండం సమీపంలోని తిరుపుళియంగుడి అనే మారు మూల గ్రామానికి చెందిన మారిముత్తుకు సినిమాల్లో దర్శకుడవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చాడు. మూడు హిట్‌ సినిమాలకు మరి సెల్వరాజ్ వద్ద ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో తనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

మారిముత్తుకు  శామ్యూల్ అనే 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మారిముత్తుకు సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. భోజనం తర్వాత సిగరెట్‌ తాగుతుండగా ఒక్కసారిగా దగ్గు రావడం ఆపై ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మారిముత్తు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మామన్నన్ విజయంతో స్టాలిన్ చేతుల మీదుగా మరిముత్తు అవార్డును ఉదయనిధి అందుకోవడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement