45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్‌

Sushmita Sen Said She Makes Big Blunder Even At Age Of 45 - Sakshi

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మిత సేన్‌ ప్రస్తుతం కుంగుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో సుస్మిత విడిపోయినట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అతడితో డేటింగ్‌ చేస్తూ, లివింగ్‌ రిలేషన్‌షిప్‌‌ను కొనసాగిస్తున్న ఈ జంట విడిపోవడం అందరికి షాక్‌ ఇచ్చింది. ఇక ఆమె తాజా పోస్టు చూస్తుంటే సుస్మిత ప్రియుడికి దూరమై మనోవేదనతో కుంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. తన పోస్టులో ఆమె ఇలా రాసుకొచ్చారు.

‘అన్ని పరిస్థితిల్లో నేను సానుకూలంగా ఉంటానని అందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. నా జీవితంలో కూడా నేను తప్పులు చేశాను, వాటి ఫలితాలను అనుభవిస్తున్నాను. ఇప్పటికి 45 ఏళ్ల వయసులో కూడా నేను ఎంపికలో పెద్ద పొరపాటు చేశాను. దాని వల్ల ఇప్పుడు తీవ్ర వేదనకు గురవుతున్న. అయితే దీనికి కారణమైన వాటిని గుర్తుపెట్టుకుని తిరిగి లెక్కలు వేసుకుంటు, అబద్దాలతో, నిరాశలో ఉండిపోవాలనుకోవడం లేదు. తప్పు చేసినవారేవరైన దీని నుంచి తప్పించుకోలేరు’ అంటు ఆమె రాసుకొచ్చారు.  

అలాగే ‘ఇక దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే.. ఎంత కష్టాన్నైనా దానిని కర్మ రుణంగా చూడాలని, అదే విధంగా పూర్తి ఆశభావంతో తిరిగి దానిని చెల్లించాలి!. ఇక దానికి కారణమైన వారి విషయానికి వస్తే వారి కర్మ ఇప్పుడే ప్రారంభమైంది’ అంటు సుష్మిత తన పోస్టులో పేర్కొన్నారు. ఇది ఉండగా కొద్ది రోజుల కిందట సుష్మిత ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ. ‘సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది’ అంటు రోహ్మాన్‌తో విడిపోయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు.

చదవండి: 
సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్‌ చెప్పేసిన నటి 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top