విశ్వనాథ్ అండ్ సన్స్.. సింగర్‌గా సూర్య! | Suriya sung by a song latest Movie vishwanath and sons | Sakshi
Sakshi News home page

vishwanath and sons: విశ్వనాథ్ అండ్ సన్స్.. సింగర్‌గా సూర్య!

Jun 29 2026 4:26 PM | Updated on Jun 29 2026 4:45 PM

Suriya sung by a song latest Movie vishwanath and sons

కోలీవుడ్ హీరో సూర్య ఇటీవలే కరుప్పు మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తర్వాత సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను స్వయంగా సూర్యనే పాడారు. ఈ పాటకు కేవలం డ్యాన్స్ చేయడమే కాదు.. తన గొంతుతోనే  అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా... కెన్ కరుణాస్ లిరిక్స్‌ అందించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలిపారు. 

ఇటీవలే రిలీజైన నేనో బటర్‌ఫ్లై పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement