పుష్ప ఐటం సాంగ్‌: సన్నీలియోన్‌ అంత డిమాండ్‌ చేసిందా? | Sunny Leone Shocking Remuneration For Pushpa Special Song | Sakshi
Sakshi News home page

Sunny Leone: బన్నీతో ఆడేందుకు సన్నీ అంత డిమాండ్‌ చేసిందా?

Jul 26 2021 3:06 PM | Updated on Jul 26 2021 3:11 PM

Sunny Leone Shocking Remuneration For Pushpa Special Song - Sakshi

'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల్లోని పాటలను మించిపోయేలా పుష్పలో ఓ ఐటం సాంగ్‌ కంపోజ్‌ చేస్తున్నాడట డీఎస్పీ. ఈ ప్రత్యేక పాటలో బన్నీతో స్టెప్పులేయడానికి సన్నీలియోన్‌..

Pushpa Item Song: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం "పుష్ప". మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ రోల్‌ చేస్తుండగా టాప్‌ యాంకర్‌ అనసూయ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న పుష్ప రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాదిలో, రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది. 

ఇదిలా వుంటే బన్నీ, డీఎస్పీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చే ఐటం సాంగ్స్‌ రేంజ్‌ ఏంటో 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల్లోనే చూశాం. అందులోని పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. వాటిని మించిపోయేలా పుష్పలో ఓ ఐటం సాంగ్‌ కంపోజ్‌ చేస్తున్నాడట డీఎస్పీ. ఈ ప్రత్యేక పాటలో బన్నీతో స్టెప్పులేయడానికి దిశాపటానీని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఊర్వశి రౌతేలా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె స్థానంలో మరో నటి పేరు బలంగా వినిపిస్తోంది.

మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ను ఐటం సాంగ్‌ కోసం సంప్రదించినట్లు ఫిల్మీదునియాలో టాక్‌ వినిపిస్తోంది. ఇందుకోసం ఆమె అక్షరాలా 90 లక్షలు డిమాండ్‌ చేసిందట. ఆమెకున్న డిమాండ్‌ అలాంటిది కాబట్టి మేకర్స్‌ కూడా అడిగినంత అప్పజెప్పేందుకు సానుకూలంగా ఉన్నారట! గతంలో కరెంట్‌ తీగలో మెరుపు తీగలా అలరించిన సన్నీలియోన్‌ ఈసారి పుష్పలో ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement