ఏడేళ్ల తర్వాత సీక్వెల్‌.. 'మాయావన్‌' టీజర్‌ విడుదల | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత సీక్వెల్‌.. 'మాయావన్‌' టీజర్‌ విడుదల

Published Thu, May 9 2024 6:32 PM

Sundeep Kishan's MaayaOne Teaser Out Now

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాయావన్‌'. కోలీవుడ్‌లో 2017లో సి.వి. కుమార్‌ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. తాజాగా పార్ట్‌-2 నుంచి టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. తెలుగులో 'ప్రాజెక్ట్ z' పేరుతో మొదటి భాగం ఏప్రిల్‌ 6న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రాబోతున్న 'మాయావన్‌' సీక్వెల్‌ నుంచి తాజాగా టీజర్‌ విడుదలైంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సి.వి. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం భారీ హిట్‌ కావడంతో ఏడేళ్ల తర్వాత మాయావన్‌ పేరుతోనే సీక్వెల్‌ రానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement