'డియర్ ఉమ' టీజర్‌.. నిర్మాతగా తెలుగమ్మాయి సుమయ రెడ్డి | Sumaya Reddy Dear Uma Movie Official Teaser | Sakshi
Sakshi News home page

'డియర్ ఉమ' టీజర్‌.. నిర్మాతగా తెలుగమ్మాయి సుమయ రెడ్డి

Apr 8 2025 12:10 PM | Updated on Apr 8 2025 12:31 PM

Sumaya Reddy Dear Uma Movie Official Teaser

ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం నుంచి టీజర్‌ విడుదలైంది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి(Sumaya Reddy) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు.  అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement