'మెమొరీస్' సాంగ్‌.. హీరో సుధాకర్‌.. మరి హీరోయిన్‌? | Sudhakar Komakula Memories Full Video Song Out Now, Trending On Social Media - Sakshi
Sakshi News home page

Sudhakar Komakula Memories Song: రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన మెమొరీస్‌ సాంగ్‌ విన్నారా? సుధాకర్‌ యాక్టింగ్‌..

Published Sat, Dec 2 2023 6:14 PM

Sudhakar Komakula Memories Full Song Out Now - Sakshi

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ నటుడు సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాటను సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి చిత్రీకరించారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ సొంతం చేసుకోవడం విశేషం. 'మెమొరీస్' వీడియో సాంగ్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై హీరో అడివి శేష్‌ రిలీజ్‌ చేశారు.

అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్.. సైమా అవార్డ్స్‌లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా, సోని మ్యూజిక్‌లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడనేదే ఈ సాంగ్‌.

ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది.  సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్‌టైన్‌ చేసేలా ఉంది.

చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్‌.. అందుకే టాస్క్‌లు..

Advertisement
 
Advertisement
 
Advertisement