నిజంగా ఇదో అద్భుతం.. రాజమౌళి ప్రశంసలు | SS Rajamouli Response On Tesla Cars Light Show For Natu Natu Song | Sakshi
Sakshi News home page

SS Rajamouli: మీ అభిమానానికి పొంగిపోయా.. రాజమౌళి ప్రశంసలు

Mar 21 2023 8:16 PM | Updated on Mar 21 2023 8:21 PM

SS Rajamouli Response On Tesla Cars Light Show For Natu Natu Song - Sakshi

నాటు నాటు సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆ‍ర్ చిత్రంలోని ఈ పాటకు అమెరికాలోనూ క్రేజ్ మామూలుగా లేదు. తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్లతో ప్రదర్శించిన ఓ వీడియో సోషల్ మీడియోలో పెద్దఎత్తున వైరలైంది. ఈ వీడియో చూసిన రాజమౌళి తాజాగా స్పందించారు. ఆ  వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేస‍్తూ అద్భుతమంటూ కొనియాడారు. 

రాజమౌళి తన ట్విటర్‌లో రాస్తూ.. 'న్యూజెర్సీ నుంచి నాటు నాటు పాటకు మీరు చూపిన అభిమానానికి నిజంగా పొంగిపోయా. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతటి అధ్బుతమైన వీడియోను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాటు నాటు సాంగ్‌కు టెస్లా కార్లతో లైట్‌ షో ఒక అద్భుతమైన అనుభూతి.' అంటూ పోస్ట్ చేశారు.

ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు సాంగ్ ఇంత క్రేజ్ తీసుకొచ్చన ఘనత దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ఈ పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement