రాజమౌళి సార్.. ఇది ఎల్లప్పుడు మీ కోసమే: సుకుమార్ | Director Sukumar Congratulations To SS Rajamouli On RRR For Oscar | Sakshi
Sakshi News home page

Director Sukumar: అలా ఎందుకు చేశానో ఇప్పుడు అర్థమైంది.. సుకుమార్ పోస్ట్ వైరల్

Published Wed, Jan 25 2023 9:07 PM | Last Updated on Wed, Jan 25 2023 9:25 PM

Director Sukumar Congratulations To SS Rajamouli On RRR For Oscar - Sakshi

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లతో దర్శకుడు సుకుమార్‌ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా తనదైన శైలిలో విష్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళిపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా రాజమౌళికి వినూత్న రీతిలో అభినందనలు తెలియజేశారు సుకుమార్. ఓ మీటింగ్‌ రూమ్‌లో తన బృందంతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఖాళీగా ఉన్న కుర్చీని ప్రస్తావించారు. 

 సుకుమార్ మాట్లాడుతూ..'ఇన్నాళ్లుగా నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నింటిలో అసంకల్పితంగా ప్రిన్సిపల్ కుర్చీని ఖాళీగా వదిలేశా. కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నా. ఎస్.ఎస్.రాజమౌళి సార్ ఈ కుర్చీ మీ కోసమే. ఈ కుర్చీ ఎప్పుడు  మీకు చెందినదే. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి అండ్ మూవీ టీమ్‌కి అభినందనలు.' అని అన్నారు. ఆ తర్వాత నాటు నాటు సాంగ్ లిరిక్స్ అందించిన చంద్రబోస్‌.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాట పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement