hero sharwanand sreekaram novie teaser unveiled by prince mahesh babu - Sakshi
Sakshi News home page

రైతు తన కొడుకుని రైతును చేయడం లేదు

Feb 9 2021 7:15 PM | Updated on Feb 9 2021 7:57 PM

Sreekaram Teaser: Prince Mahesh Babu unveiled - Sakshi

‘తినేవాళ్లు నెత్తిమీద జుట్టు అంత ఉంటే.. పండించేవాళ్లు మూతిమీద మీసం అంతమంది కూడా లేరు’

‘ఓ హీరో త‌న కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకును డాక్ట‌ర్.. ఒక ఇంజినీర్ త‌న కొడుకు ఇంజినీర్ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం త‌న కొడుకును రైతును చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టి నాకు జ‌వాబు లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. ఆయన హీరోగా, కిశోర్‌.బి దర్శకత్వం వహించిన చిత్రం శ్రీకారం. ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం సూపర్‌స్టార్‌ మ‌హేశ్‌బాబు విడుద‌ల చేశారు. ‘మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న శ్రీకారం బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ మహేశ్‌ టీజ‌ర్‌ను విడుదల చేశాడు.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల నేపథ్యంతో సినిమా తీస్తున్నట్లు టీజర్‌లో ఉంది. వ్య‌వసాయ ప్రాధాన్యం తెలిపేలా సినిమా నేపథ్యం ఉందని తెలుస్తోంది. ‘తినేవాళ్లు నెత్తిమీద జుట్టు అంత ఉంటే.. పండించేవాళ్లు మూతిమీద మీసం అంతమంది కూడా లేరు’ అంటూ రైతుల గురించి శర్వానంద్‌ చెప్పిన డైలాగ్స్‌ హృదయాలను హత్తుకునే విధంగా ఉన్నాయి. 

కుటుంబ చిత్రంగా 14  రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే’, ‘వస్తానంటివో పోతానంటివో భలేగుంది బాల’ పాటలు విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే సాయంత్రం 4.05 గంటలకు టీజర్‌ విడుదల చేస్తారని ప్రకటించగా.. దాదాపు ఓ గంట ఆలస్యంగా విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement