స్పైకి కథే హీరో | Sakshi
Sakshi News home page

స్పైకి కథే హీరో

Published Wed, May 17 2023 12:27 AM

Spy releases on June 29 - Sakshi

‘‘ఈ మధ్య ప్రేక్షకులు ఇష్టపడుతున్నది మంచి కథనే. హీరో, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంత ఉన్నా కథ అనే సోల్‌ లేకపోతే బ్లాక్‌ బస్టర్‌ అవ్వదు. ‘స్పై’ మూవీకి కథే హీరో’’ అని హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ అన్నారు. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా జూన్‌ 29న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో హీరో నిఖిల్‌ మాట్లాడుతూ – ‘‘సుభాష్‌ చంద్రబోస్‌గారి గురించి, ఆయన స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ గురించి, ఆ సంస్థ సేవల గురించి చాలామందికి తెలియదు. దేశానికి తెలియాల్సిన ఆ విషయాలతో పాటు వినోదాత్మకంగా ఈ మూవీ ఉంటుంది’’ అన్నారు.

‘కార్తికేయ 2’ తర్వాత ఓ పార్టీకి అనుకూలంగా మీరు ‘స్పై’ చేస్తున్నారనే ప్రచారంపై మీ స్పందన అని అడగ్గా – ‘‘కృష్ణుడంటే నాకు నమ్మకం. అందుకే ‘కార్తికేయ 2’ చేశాను. ఇప్పుడు ఓ భారతీయుడిగా ‘స్పై’ చేశాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు’’ అన్నారు నిఖిల్‌. ‘‘డైరెక్టర్‌గా నా తొలి సినిమా నిఖిల్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు గ్యారీ బీహెచ్‌.

‘‘స్పై’ చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు’’ అన్నారు చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి. సంగీత దర్శకులు శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్, సినిమాటోగ్రాఫర్‌ వంశీ పచ్చిపులుసు, మాటల రచయిత అనిరుధ్‌ కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement