చెప్పిన తేదీకే స్పిరిట్‌ | Spirit makers clarify release date: Prabhas and Sandeep Reddy Vanga film sticks to March 2027 | Sakshi
Sakshi News home page

చెప్పిన తేదీకే స్పిరిట్‌

May 8 2026 3:27 AM | Updated on May 8 2026 3:27 AM

 Spirit makers clarify release date: Prabhas and Sandeep Reddy Vanga film sticks to March 2027

నో డౌట్‌... చెప్పిన తేదీకే ‘స్పిరిట్‌’ థియేటర్స్‌కి వస్తుందంటున్నారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్‌ బ్యానర్స్‌పై భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌.

 కాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్లాన్‌ చేసిన ప్రకారం జరగడంలేదని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందనీ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలకు స్పందిస్తూ... ‘‘చెప్పిన తేదీకే ‘స్పిరిట్‌’ని విడుదల చేస్తాం’’ అని క్లారిటీ ఇచ్చినట్లుగా ఓ వార్త వైరల్‌ అవుతోంది.  2027 మార్చి 5న 8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్‌–వరల్డ్‌ ఎంటర్‌టైనర్‌లో వివేక్‌ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement