సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం

Sonu Sood premises raided by IT officials for alleged tax evasion - Sakshi

ముంబైలో వివిధ నివాసాలపై ఏకకాలంలో దాడులు

ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌పై ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ముంబైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాంలో శుక్రవారం దాడులు చేసినట్టుగా ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోనూ సూద్‌కు చెందిన మరిన్ని నివాసాలపై వరసగా మూడో రోజు దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలిపాయి. రియల్‌ ఎస్టేట్‌కు చెందిన ఒక ఒప్పందం, మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు వివరించాయి. కరోనా సంక్షోభ సమయంలో వలసదారుల్ని తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చడంలో ఎంతో సాయం చేసిన సోనూ సూద్‌ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ సోనూని ఆప్‌ పార్టీ తరపున దేశ్‌ కా మెంటర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనపై ఐటీ శాఖ చేస్తున్న దాడులకి రాజకీయ పరమైన కారణాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top