సుశాంత్‌ నెం 1.. బన్నీని వెనక్కినెట్టిన సోనూసూద్‌!

Sonu Sood beats Allu Arjun in Yahoo Most Searched Males list 2020 - Sakshi

సినిమాలో విలన్‌ పాత్రలు పోషించే నటుడు సోనూసూద్‌ లాక్‌డౌన్‌లో రియల్‌ హీరోగా మారారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడిన ఎంతో మందికి సాయం అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లాక్‌డౌన్‌లో ప్రారంభమైన సోనూసూద్‌ చేస్తున్న సేవలు నేటికి కొనసాగుతున్నాయి. బాలీవుడ్‌ నటుడైన సోనూసూద్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితుడే. సూపర్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన సోనూసూద్‌ జులాయి, అతడు, ఆగడు, అరుంధతి, శక్తి, సీత వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం యాహూలో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన ప్రముఖుల్లో సోనూసూద్‌కు స్థానం లభించింది. చదవండి: సుశాంత్‌ కేసు: రియా సోదరుడికి బెయిల్‌

యాహూ 2020 లో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత రెండవ స్థానంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, మూడో స్థానంలో నటుడు అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. కాగా తొలిసారి ఈ జాబితాలోకి సోనూసూద్‌ ఎంటర్‌ అయ్యారు. గూగుల్‌లో ఎ‍క్కువ మంది శోధించిన వారిలో సోనూసూద్‌ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఈ స్థానాన్ని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ దక్కించుకోగా. ప్రస్తుతం బన్నీ పదో స్థానానికి పడిపోయారు. యాహూ జాబితాలో టాప్‌ 10లో టాలీవుడ్‌ హీరోల నుంచి అల్లు అర్జున్‌ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. చదవండి: బన్నీకి విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌.. థ్యాంక్స్‌ బ్రదర్‌

టాప్‌ 10 మంది వరుసగా..
1. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌
2. అమితాబ్‌ బచ్చన్‌
3. అక్షయ్‌ కుమార్‌
4. సల్మాన్‌ ఖాన్‌
5. దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌
6. దివంగత నటుడు రిషి కపూర్‌
7. దివంగత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం
8. సోనూసూద్‌
9. అనురాగ్‌ కశ్యప్‌
10. అల్లు అర్జున్‌

కాగా ఈ జాబితాలో మహిళా ప్రముఖుల విభాగంలో బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి అగ్రస్థానంలో నిలిచారు. నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదురవ్వడంతో రియా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై, సుశాంత్‌ మరణంతోపాటు పలువురిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెను హాట్‌ టాపిక్‌గా మార్చింది.

ఇక వరుసగా టాప్‌ 10 జాబితాను చూసుకుంటే..

1 రియా చక్రవర్తి
2 కంగనా రనౌత్‌
3 దీపికా పదుకొనె
4 సన్నీ లియోన్‌
5 ప్రియాంక చోప్రా
6 కత్రినా కైఫ్‌
7 నేహా కక్కర్‌
8 కనికా కపూర్‌
9 కరీనా కపూర్‌
10 సారా అలీ ఖాన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top