
సెలెబ్రెటీల ప్రేమ, పెళ్లి విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. పెళ్లయ్యే వరకు డేటింగ్, ప్రేమ పుకార్లు చక్కర్లు కొడితే.. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిస్తాయి. తండ్రి కాబోతున్న హీరో, తల్లి కాబోతున్న హీరోయిన్ అంటూ వార్తలు వస్తాయి. తాజాగా అలాంటి ప్రెగ్నెన్సీ పుకారే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) విషయంలో వచ్చింది. అయితే ఆ పుకార్లకు కారణం తన భర్తే అంటుంది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన ఆధారాలను బయటపెడుతూ.. ప్రెగ్నెన్సీ రూమర్స్కి చెక్ పెట్టింది.
సోనాక్షి ఇటీవల కాస్త బరువు పెరిగింది. దీంతో ఆమె గర్బం దాల్చిందని, అందుకే బొద్దుగా మారిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. చాలా మంది నిజమే అని నమ్మారు. తాజాగా దీనిపై సోనాక్షి స్పందించారు. తాను ప్రెగ్నెంట్ కాదని చెబుతూనే.. బరువు పెరగడానికి భర్తే కారణం అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

భర్త జహీర్ ఇక్బాల్ రోజు తనకు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాడట. అలా బయటఫుడ్ తినడం వల్లే బరువు పెరగానని.. దీంతో అందరూ గర్భం దాల్చిందని అనుకున్నారని సోనాక్షి చెప్పుకొచ్చింది. అర్థరాత్రి 12 గంటల తర్వాత కూడా ‘ఆకలేస్తుందా? ఏమైనా తీసుకురావాలా?’ అని అడుగుతాడంటూ.. భర్తతో చేసిన వాట్సాప్ చాట్‌ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.

కాగా, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి, జహీర్ గతేడాది జూన్లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఐదు నెలల నుంచే ప్రెగ్నెన్సి రూమర్స్ మొదలయ్యాయి. గతంలో కూడా ఇలాంటి రూమర్సే వస్తే.. సోనాక్షి సింపుల్గా కొట్టిపారేసింది. ఈ సారి కూడా ఫన్వేలో తన ప్రెగ్నెన్సీ రూమర్స్కి చెక్ పెట్టింది.