
డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారి ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తున్నారు ఎస్‌జే సూర్య. పదేళ్ల విరామం తర్వాత ఆయన ‘కిల్లర్’ సినిమాతో దర్శకునిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తుండటంతోపాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించి, దర్శకత్వం వహిస్తున్నారు. గోకులం గోపాలన్ నేతృత్వంలో ఎస్‌జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్‌పై వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రీతీ అస్రాని హీరోయిన్ .
ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్స్‌ని విడుదల చేశారు. ‘‘కిల్లర్’నిపాన్ ఇండియా అంతటా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నాం. ఏఆర్ రెహమాన్ మా చిత్రానికి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఎస్‌జే సూర్య, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఐదో సినిమా ‘కిల్లర్’’’ అని చిత్రబృందం పేర్కొంది.