Singer Sunitha: నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత

Singer Sunitha Shocking Reaction About Her Fan Base in Latest Interview - Sakshi

సింగర్‌ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్‌ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన ఫ్యాన్స్‌ బేస్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెకు టాప్‌ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్‌ బేస్‌ మీకుందని, మీరు ట్రెండ్‌ సెట్టరా అని యాంకర్‌ ప్రశ్నించారు.  

చదవండి: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ

దీనిపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అదే అర్థం కాదని, అసలు వారంత తనలో ఏం చూసి అభిమానిస్తున్నారో అర్థం కాక కన్‌ఫ్యూజ్‌ అవుతానన్నారు. దీంతో అంటే మీకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువనేది మీరు ఒప్పుకోట్లేదా అని అడగ్గా.. ఇలాంటి కొన్ని అంశాలు తనని ఇబ్బంది పెడతాయన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఇదే. వారంత నా పాట అంటే ఇష్టపడతారా? నా చీరను ఇష్టపడతారా? నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా? అదే నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్లిన ‘మేడం మీ పాట అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ పలకరిస్తారు. ఓ సారి నేను ఓ ఈవెంట్‌ వెళ్లాను.

చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న ‘మెగా’ డైలాగ్‌.. దీని ఆంతర్యం ఏంటి?

అక్కడ నన్ను ఓ వ్యక్తి చూసి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. చూట్టూ బౌన్సర్స్‌ ఉన్నారు. అయినా అతను నా దగ్గరి పరుగెడుతున్నాడు. నేను అతడిని వదలిలేయమని బౌన్స్‌ర్‌కు చెప్పాను. అతను నా దగ్గరిక వచ్చి అభిమానాన్ని చాటుకుంటాడనుకున్నా. కానీ రాగానే అతడు తన ఫోన్లో నా ఫొటో చూపించాడు. అది చూపిస్తూ ‘మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు. ఈ చీర చాలా బాగుంది. ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా’ అన్నాడు అని చెప్పింది. అనంతరం ‘కొంతమందిని పక్కనే పెడితా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, గాయనీగా నా కళను గుర్తించి నన్ను.. నన్నుగా అభిమానించేవారు చాలామంది ఉన్నారని తెలిసి ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్‌ చెప్పుకుంటాను’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్‌ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top