బిగ్‌బాస్‌-4 ఎంట్రీపై సునీత క్లారిటీ

Singer Sunitha Gives Clarity On Bigg Boss 4 Telugu Rumors - Sakshi

మరికొద్ది రోజుల్లో బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసుకున్నారు నిర్వాహకులు. కరోనా నేపథ్యంలో వారిని క్వారంటైన్‌లో ఉంచారు. కాగా ఈ సీజన్‌లో పాల్గొనబోయే వారి పేర్లలో సింగర్‌ సునీత పేరు కూడా వినిపించింది. ఈ సీజన్‌లో ఆమె సందడి చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
(చదవండి : బిగ్‌బాస్ 4: ర‌ఘు మాస్ట‌ర్ అవుట్‌‌!)

అయితే బిగ్‌బాస్‌ ఎంట్రీపై తాజాగా ఆమె స్పందించారు. ఈ బిగ్‌ రియాల్టీ షోలో తాను నటించబోనని స్పష్టం చేశారు.  'డియర్‌ ఫ్రెండ్స్‌.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. అలాగే, ఈ షోలో సినీనటి కల్పిక గణేశ్ కూడా పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఈ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తుండగా.. అందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గంగవ్వ,  లాస్య మంజునాథ్‌, అమ్మా రాజశేఖర్‌, జబర్దస్త్‌ అవినాష్, సింగర్ నోయల్, నటి మోనాల్ గుజ్జార్, యూట్యూబర్లు దేత్తడి హారిక, మెహబూబా దిల్‌ సే, యాంకర్‌ అరియానా  గ్లోరీ, బుల్లితెర నటి తనూజా పుట్టస్వామి, టీవీ నటుడు సయ్యద్ సోహైల్‌, కరాటే కళ్యాణి, సూర్య కిరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? తెలియాలంటే సెప్టెంబర్‌ 6 వరకు ఆగాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top